![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -327 లో.... రామలక్ష్మికి పిండప్రధానం చెయ్యాలని శ్రీలత పంతులిని పిలిపిస్తుంది. నువ్వే పిండప్రధానం చెయ్యాలని శ్రీలత సీతాకాంత్ తో అనగానే.. నా చేతులతో నేను ఎలా చెయ్యాలి అంటూ సీతాకాంత్ బాధపడుతుంటాడు. అక్కకి ఆత్మ శాంతిస్తుందని శ్రీవల్లి అంటుంది. దాంతో సీతాకాంత్ ఒప్పుకుంటాడు.నేను ఒప్పుకోనంటూ మాణిక్యం ఎంట్రీ ఇస్తాడు.. నా కూతురు చనిపోతే తన బాడీ అన్న దొరకాలి కదా.. నా కూతురు చనిపోలేదని మాణిక్యం అంటాడు. చనిపోయింది అని సీతాకాంత్ అంటాడు.
వీళ్ళే చంపేశారు.. మిమ్మల్ని కూడ ఏదో చేస్తారు.. నాతో రండీ అల్లుడు అని మాణిక్యం అంటుంటే.. నా వాళ్ళను అనుమానిస్తున్నావ్ నేను అసలు రాను అని సీతాకాంత్ అంటాడు. నా కొడుకుని తీసుకొని వెళ్తానంటూ మాణిక్యం ధనని మాణిక్యం తీసుకొని వెళ్తూ.. నా అల్లుడిని కూడా నేను కాపాడుకుంటానని మాణిక్యం వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి ధనని తీసుకొని వెళ్తాడు. ఆ తర్వాత రామలక్ష్మి ఫోటో చూస్తూ సీతాకాంత్ బాధపడుతుంటాడు అప్పుడే శ్రీలత వాళ్లు బాబుని తీసుకొని తన దగ్గరికి వస్తారు. నువ్వు ఇలా బాధపడితే ఎలా సిరి పురిటిలోనే చనిపోయింది రామలక్ష్మి చనిపోయింది. నువ్వు ఇలా ఉంటే బాబుని ఎవరు చూసుకుంటారని అంటుంది.
బాబుని నువ్వే దగ్గరికి తీసుకోవాలని శ్రీలత అంటుంది. సీతాకాంత్ బాబుని ఎత్తుకొని మా నాన్న ప్రేమలో రామలక్ష్మి ప్రేమని చూసుకుంటానని సీతాకాంత్ అంటాడు. కొన్ని సంవత్సరాల తర్వాత అంటూ ఈ సీరియల్ ముందుకు సాగుతుంది.
ఒక పెద్దింట్లో పెద్దావిడ, పెద్దాయన ఎంట్రీ ఇస్తారు. తన మనవరాలు మైథిలి(రామలక్ష్మి) షెటిల్ ఆడుతూ ఉంటుంది. ఆ గేమ్ చివరలో మైథిలి ఓడిపోతుంది. ఏంటి అమ్మ ఓడిపోయావని వాళ్ళు అడుగగా.. మనం గెల్వడం కన్నా పక్కవాళ్ళని గెలిపిస్తేనే సంతోషంగా ఉంటుందని రామలక్ష్మి అంటుంది. దాంతో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |